ATP: ఓ వైపు పంటలను పెట్టి కాపాడుకోవాల్సిన రైతన్నలు యూరియా కోసం ఎర్రటి ఎండలో పడిగాపులు పడాల్సిన దుస్థితి నెలకొంది. రాయదుర్గం నియోజకవర్గం కనేకల్ మండలంలో కనేకల్లు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం ఎండలో నిలబడలేక రోడ్డుపైన రాళ్లు, సంచులు, టవల్స్ క్యూ లైన్లో పెట్టి ఎదురుచూస్తున్నారు. ఇప్పటికైనా యూరియా సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.