ADB: నీట్ ఐఐటీల పేరుతో కళాశాలలో అదనపు తరగతులు నిర్వహిస్తూ విద్యార్థుల నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేయడం సరైనది కాదని PDSU జిల్లా అధ్యక్షుడు సీడం సాయికుమార్ అన్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా ఐఐటీ తరగతులు కళాశాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇంటర్మీడియట్ అధికారి గణేష్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. జిల్లా ఉపాధ్యక్షుడు రాకేష్, అరుణ్ కుమార్ తదితరులున్నారు.