GNTR: పొన్నూరు మండలం వెల్లలూరు గ్రామానికి చెందిన ఐదేళ్ల తాడిశెట్టి కార్తీక్ వీధి కుక్కల దాడిలో తీవ్ర గాయాలపడి చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. గత నెల 22న ఇంటి వద్ద ఆడుకుంటుండగా కుక్కలు అతనిపై దాడి చేశాయి. వెంటనే నిడుబ్రోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన వారు, మెరుగైన చికిత్స కోసం గుంటూరు, విజయవాడ ఆసుపత్రులకు తరలించినప్పటికీ, చికిత్స ఫలితం లేక సోమవారం కార్తీక్ మృతి చెందాడు.