TG: మాజీ మంత్రి కేటీఆర్ వేసిన పరువునష్టం దావాపై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. దీనిని న్యాయపరంగా ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. కేటీఆర్‌లా తాను బెదిరింపుల కోసం దావాలు వేయనని దుయ్యబట్టారు. కేంద్రం 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను తెలంగాణకు సరఫరా చేసిందని తెలిపారు. కేవలం 9 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే పంపిణీ చేశారని ఆరోపిస్తున్నారని మండిపడ్డారు.