NZB: అంగన్వాడీ కేంద్రాల భవన నిర్మాణాలను వెంటనే చేపట్టాలని కలెక్టర్ టీ. వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. సోమవారం ఆయన మహిళా, శిశుసంక్షేమ శాఖ పనితీరుపై కలెక్టర్ సమీక్ష జరిపి మాట్లాడారు. జిల్లాలో 1,501 అంగన్వాడీ కేంద్రాలకు, 494 కేంద్రాలకు సొంత భవనాలు ఉన్నాయన్నారు. 610 అద్దె భవనాల్లో, మరో 397 కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.