JGL: రాయికల్ మండలంలోని రామాజీపేట గ్రామంలో గల కొత్తవాడలో నిర్మిస్తున్న అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం కాలనీవాసులు గ్రామ పంచాయితీ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఇంటి నిర్మాణం చేపడుతున్నారని, నూతన గృహ నిర్మాణ పనులను వెంటనే ఆపివేయాలని కాలనీవాసులు ఫిర్యాదులో పేర్కొన్నారు.