VSP: ఏపీ మెప్మా ఆర్పీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో (సీఐటీయూ) సోమవారం విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్పీలకు బకాయి ఉన్న మూడు నెలల జీతాలను తక్షణమే చెల్లించాలని, పని భారం తగ్గించాలని సంఘం గౌరవాధ్యక్షురాలు పి. మణి డిమాండ్ చేశారు. 22వ వార్డు జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ తమను రాజకీయంగా వేధిస్తున్నారని ఆరోపించారు.