KDP: వాహనదారులు తప్పనిసరిగా లైసెన్సులు కలిగి ఉండాలని బద్వేల్ అర్బన్ SI సత్యనారాయణ అన్నారు. సోమవారం బద్వేల్లోని 4 రోడ్ల కూడలిలో సిబ్బందితో కలసి తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బైకర్లు ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. వాహనాలకు సంబంధించిన లైసెన్సులు బండిలో ఉండాలన్నారు. కార్ డ్రైవర్లు సీటు బెల్టు పెట్టుకోవాలన్నారు.