MDK: నర్సాపూర్ అగ్నిమాపక కేంద్రం వద్ద విద్యుత్ మరమ్మత్తు పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న నర్సాపూర్ నియోజకవర్గ ఇంఛార్జి ఆవుల రాజిరెడ్డి వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని, అనంతరం ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని అధికారులను కోరారు.