CTR: కాణిపాకంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల16న తెప్పోత్సవాలు నిర్వహిస్తారు. తెప్పోత్సవం ముగిసిన అనంతరం కోనేరు వద్ద మహా ప్రసాదమైన లడ్డూను వేలంపాట నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో పెంచల కిషోర్ తెలిపారు. 2024లో జరిగిన వేలంలో భారీ లడ్డూ రూ. 4 లక్షల 25 వేల రూపాయలకు అమ్ముడుపోయిందని చెప్పారు.