రొంపిచెర్ల మండల ఏఎంసీ డైరెక్టరుగా చెంగల్ రెడ్డి ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో సోమవారం పుంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రా రెడ్డిని డైరెక్టర్ చెంగల్ రెడ్డి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.