TG: నిన్న వర్షాలకు హైదరాబాద్ అసిఫ్ నగర్‌లోని అఫ్జల్‌సాగర్‌లో ఇద్దరు గల్లంతయ్యారుని హైడ్రా కమిషనర్ చెప్పారు. నాళాల కబ్జావల్లే ఈ ప్రమాదాలు జరిగాయని స్పష్టం చేశారు. ఒక నిర్మాణం కారణంగా నాళాల్లో వరదనీరు అడ్డు పడిందన్నారు. దీంతో అఫ్జల్‌సాగర్ వద్ద కొన్ని ఇళ్లు తొలగింపునకు నిర్ణయం తీసుకున్నామన్నారు. అయితే నిన్న మొత్తం ముగ్గురు గల్లంతు కాగా.. ఇద్దరు మరణించారు.