GNTR: అసెంబ్లీ సమావేశాల భద్రత ఏర్పాట్లపై సోమవారం సమీక్ష సమావేశం జరిగింది. సచివాలయంలోని అసెంబ్లీ హాల్లో ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించారు. వీవీఐపీ, వీఐపీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీసీలు, ప్రభుత్వ ఉన్నతాధికారుల ప్రయాణ మార్గాలలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు, ఇతర విషయాల గురించి చర్చించారు.