NLR: విడవలూరు పట్టణంలో సోమవారం యూరియా వాడకంపై స్థానిక రైతులకు ఎంఏవో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులకు నవధాన్యాల సాగు యొక్క ఉపయోగాల గురించి వివరిస్తూ ర్యాలీ చేశారు. అధికంగా యూరియా వాడడం వలన నేల యొక్క సారవంతం తగ్గిపోవడమే కాకుండ పంటలో తెగుళ్లు అధికంగా వచ్చే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో ఎంఏవో లక్ష్మీ వ్యవసాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.