WGL: మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఇందిరా మహిళా పాల ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య లిమిటెడ్ ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి తెలిపారు. సోమవారం గీసుకొండ మండల కేంద్రంలో మహిళా సంఘాల శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు అందజేశారు. దామెరలో పది ఎకరాల్లో సంఘాలకు పాల డైరీ ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.