JGL: పట్టణవాసులు నిషేధిత ప్లాస్టిక్‌ను వినియోగిస్తే చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ రవీందర్ అన్నారు. కోరుట్ల పట్టణంలోని పలు టిఫిన్ సెంటర్లు, కిరాణ దుకాణాలలో మున్సిపల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు సోమవారం చేపట్టారు. ఈ సందర్భంగా కమిషనర్ మట్లాడుతూ.. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిస్థాయిలో నిషేదించాలన్నారు. ప్లాస్టిక్‌ను వినియోగిస్తే భారీ జరిమానా విధిస్తామన్నారు