W.G: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, నేషనల్ కెరీర్ సర్వీస్ ఆధ్వర్యంలో తణుకు చిట్టూరి ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఈనెల 17న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి పి.లోకమాన్ తెలిపారు. వివిధ బహుళజాతి సంస్థల పరిధిలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని చెప్పారు. 96185 60188, 94408 38388 నెంబర్లను సంప్రదించాలన్నారు.