MBNR: ఈ ఏడాది ప్రజా ప్రభుత్వంలో జడ్చర్ల నియోజకవర్గంలో పంట రుణాలు పెరిగాయని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ.. 2025_26 సంవత్సరానికి 2,148 కోట్ల రుణసాయం అందించమని తెలిపారు. దీంతో రైతులకు గత ఏడాది కంటే ఈ ఏడాది అధిక లబ్ధి చేకూరిందని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం అని ఆయన పేర్కొన్నారు.