SRD: కంగ్టి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం హిందీ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక హిందీ పండిత్ చరణ్ సింగ్ మాట్లాడుతూ.. మన దేశంలోని రాష్ట్రాల్లో ప్రాంతీయ భాషలతో పాటు ప్రతి ఒక్కరికి హిందీ భాష వస్తుందన్నారు. విద్యార్థులు హిందీ రాయడం, చదవడమే కాకుండా మాట్లాడడం నేర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో లెక్చరర్లు వెంకట్ రెడ్డి, సబిత ఉన్నారు.