SKLM: నరసన్నపేట ఏరియా హాస్పిటల్లో అరుదైన దంత శస్త్ర చికిత్స నిర్వహించామని దంత వైద్య నిపుణులు డాక్టర్ దానేటి రమేష్, డాక్టర్ సత్యసాయి తెలిపారు. సోమవారం నిర్వహించిన ఈ చికిత్సలో భాగంగా ఇటీవల నరసన్నపేటకు చెందిన టి.జయ ద్విచక్ర వాహన ప్రమాదంలో పై దవడ విరిగిపోవడంతో ఆసుపత్రిలో చేరారని తెలిపారు. ఈ క్రమంలో ఆర్చ్ బార్ చికిత్స ద్వారా సరి చేశామని వివరించారు.