NZB: ఈనెల 17న నిర్వహించనున్న ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ టీ. వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగే ఈ వేడుకలకు ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డిముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. ఈ ఏర్పాట్లపై సోమవారం కలెక్టర్ సంబంధిత శాఖల సమావేశమై చర్చించారు.