MDK: తూప్రాన్ పట్టణంలో సోమవారం కమ్మరి నరేష్ అలియాస్ నితిన్(22) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మాసాయిపేట మండలం చెట్ల తిమ్మాయపల్లికి చెందిన నరేష్ కుటుంబం కొంతకాలంగా తూప్రాన్ పట్టణంలో నివాసముంటుంది. ప్రేమ వ్యవహారంలో మనస్థాపానికి గురైన నరేష్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.