అన్నమయ్య జిల్లాలో సోమవారం అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. తంబళ్లపల్లె మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలికపై అదే ఊరికి చెందిన 12ఏళ్ల బాలుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక తండ్రి ఫిర్యాదుతో బాలుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు తంబళ్లపల్లె SI ఉమామహేశ్వర్ రెడ్డి తెలిపారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు.