WGL: పర్వతగిరి మండలంలోని చింతనెక్కొండ అన్నారం, పర్వతగిరికి చెందిన గుడుంబా విక్రయదారులను తహసీల్దార్ వెంకటస్వామి ముందు సోమవారం బైండోవర్ చేసినట్టు వర్ధన్నపేట ఎక్సైజ్ ఎస్సై సరిత తెలిపారు. అన్నారంకు చెందిన మౌర్య హనుమంతు, పిట్టల రామక్క, చింత నెక్కొండకు చెందిన బొచ్చు లచ్చమ్మ, పర్వతగిరికి చెందిన పుల్లూరు కుమారస్వామి బైండోవర్ చేసినట్లు తెలిపారు.