కృష్ణా: బాపులపాడులో రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న డంపింగ్ యార్డ్ కారణంగా జగనన్న కాలనీ రహదారి పూర్తిగా మూసుకుపోయిందని ప్రజలు వాపోతున్నారు. వర్షాల సమయంలో నీరు, చెత్త కలిసిపోవడంతో దుర్వాసన వెదజల్లుతుందని ప్రజలు చెబుతున్నారు. అధికారులు స్పందించి రహదారిని నిర్మించడంతోపాటు చెత్తాచెదారాన్ని తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.