VSP: ఆటో కార్మికుల రాష్ట్ర ధర్నాను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గనిశెట్టి పరవాడ పిలుపునిచ్చారు. సోమవారం పరవాడలో రాష్ట్ర ధర్నాకు సంబంధించిన గోడపత్రికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫ్రీ బస్ పథకం వల్ల ఆటో కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని, ప్రభుత్వం వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.