WNP: ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధిపనులు చేపట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. కొత్తకోటలోని 13వ వార్డు ప్రధానరహదారి పక్కన రూ.20 లక్షల నిధులతో నిర్మించనున్న సైడ్ డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. గత ప్రభుత్వ పాలనలో కుంటుపడిన అభివృద్ధి ప్రజాపాలనలో పరుగులు పెట్టిస్తున్నామన్నారు.