కృష్ణా: రైతుల సంక్షేమమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే రాము అన్నారు. గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు గ్రామ పీఏసీఎస్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. PACS చైర్మన్గా చింతపల్లి శివారెడ్డి, చిలక నాగరాజు, డొక్కు రాంబాబు బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఎమ్మెల్యే రాము వారికి శుభాకాంక్షలు తెలిపారు.