ఆఫీసులో ఉన్నప్పుడు పని మీదే పూర్తిగా ధ్యాస పెట్టండి. ఇంట్లో ఉన్నప్పుడు కుటుంబ విషయాల మీదే శ్రద్ధపెట్టండి. ఆఫీసులో పని చేసేటప్పుడు ఇంటి సమస్యల గురించి, ఇంట్లో ఉన్నప్పుడు ఆఫీసులో పూర్తి చేయాల్సిన పనుల గురించి ఆలోచిస్తే దేని మీదా ఏకాగ్రత పెట్టలేరు. ప్రస్తుత క్షణంలో ఏం చేయాలో దానికి వందశాతం న్యాయం చేయడమే మన బాధ్యతగా భావించాలి.