WNP: తెలంగాణ రైతు సంఘం వనపర్తి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో యూరియా సమస్యను పరిష్కరించాలని, ఉల్లి రైతుకు పంట నష్ట పరిహారం చెల్లించాలని ప్రజావాణిలో కలెక్టర్ కి వినతిపత్రం అందజేశారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షలు బాల్ రెడ్డి మాట్లాడుతూ.. ఆగ్రో కేంద్రాలలో రైతులు క్యూ లైన్లో నిలబడి అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి అవసరమైన యూరియా రైతులకు అందించాలని కోరారు.