E.G: ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో అలసత్వం వహించరాదని, నిర్ణీత సమయంలో ప్రజా సమస్యలను పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి టి.సీతారామమూర్తి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద నిర్వహించిన PGRS కార్యక్రమంలో ప్రజల నుంచి 152 ఫిర్యాదులను స్వీకరించారు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించరాదని సూచించారు.