మేడ్చల్: ఘట్కేసర్ మండల FSCS బ్యాంకులో అర్హులైన రైతులకు రుణమాఫీ చేయాలని కోరుతూ రిలే నిరాహార దీక్ష చేపట్టగా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ జక్కా వెంకటరెడ్డి మద్దతు తెలిపారు. వెంకటరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైనప్పటికీ ఎందుకు రుణమాఫీ చేయడం లేదని ప్రశ్నించారు.