ADB: బోథ్ మండలం కొల్లాపూర్లో చందర్ సింగ్ అనే వ్యక్తి నాటు వైద్యం పేరుతో ప్రజలను మోసం చేస్తున్నాడని, బాధితురాలికి నయం చేయకపోగా మరింత వికటించేలా చేశాడని డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. కరీంనగర్ జిల్లాకు చెందిన జ్యోతి ఫిర్యాదు మేరకు బాబాను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. నాటు వైద్యం చేసే బాబాలను, మంత్రగాళ్లను ప్రజలు విశ్వసించొద్దని ఆయన సూచించారు.