TG: విద్యార్థులకు ఫీజు రియింబర్స్ మెంట్ బకాయిల పాపం ముమ్మాటికీ బీఆర్ఎస్ దేనని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. నాలుగేళ్లు పెండింగ్లో ఉంచడం వల్లే ఇప్పుడు ప్రభుత్వంపై భారం పెరిగిందని తెలిపారు. యూరియా విషయంలోనూ ఆ పార్టీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. రైతుల పక్షాన కేంద్రాన్ని, మోదీని ఎందుకు విమర్శించడం లేదని ప్రశ్నించారు.