కృష్ణా: కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యానికి ప్రాధాన్యతనిస్తోందని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. సోమవారం పెడనలో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా 78 మందికి రూ.46.66 లక్షల సహాయ నిధి చెక్కులు, ఎల్వోసీ పత్రాలను ఎమ్మెల్యే లబ్ధిదారులకు అందచేశారు. పేదవర్గాలందరికీ వైద్య సేవలు అందించేలా కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుందన్నారు.