NLR: ముత్తుకూరు మండలం వల్లూరు పంచాయతీ పరిధిలోని అచ్చన్న తోపులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా నంద్యాల కృష్ణయ్య ఏడుకొండలు అనే రైతులకు సంబంధించిన గడ్డివాము దగ్ధమైంది. స్థానికులు మంటలను ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ పూర్తిగా కాలిపోయింది. దీంతో మూడు లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.