NLR: కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సోమవారం ఉలవపాడు మండలంలో పర్యటించారు. అనంతరం మండలంలోని బద్దిపూడి గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులు రూ. 16 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. అనంతరం ప్రజలతో మాట్లాడుతూ.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో TDP నేతలు తదితరులు పాల్గొన్నారు.