ప్రకాశం: అర్జీలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి సత్వరమే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని అధికారులను జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ ఆదేశించారు. సోమవారం ఒంగోలులోని గ్రీవెన్స్ హాలులో నిర్వహించిన మీ కోసం ప్రజల నుంచి జేసీ అర్జీలు స్వీకరించారు. ఈ సందర్బంగా జేసీ ఫిర్యాదుదారులతో మాట్లాడి త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.