ATP: జిల్లా పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో సోమవారం “ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)” కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ పి. జగదీష్ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలతో మాట్లాడి 121 ఫిర్యాదులను స్వీకరించారు. కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులు, రస్తా తగాదాలపై విచారణ జరిపి జాప్యం లేకుండా చట్టపరిధిలో పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు.