WNP: పెద్దగూడెం తండాలో విద్యుత్ లైన్ ఏర్పాటు చేసేందుకు కావలసిన స్థలంకోసం సమగ్ర సర్వేచేసి నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. లైను వెళ్లే మార్గంలో అటవీభూమి, ఇతర భూమి ఎంత అవసరముందని దానిపై రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు సంయుక్తంగా సర్వే చేయాలని ఆదేశాలు జారీచేశారు.