NLG: స్వాతంత్య్ర సంగ్రామంలో యావత్ భారతావనిని జాగృతం చేసి ఏకతాటిపై నడపేందుకు హిందీ భాష ఎంతో దోహదపడిందని హెచ్ఎం బి.సుశీల అన్నారు. చిట్యాల పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం హిందీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వం హిందీ భాషను జాతీయ భాషగా గుర్తించినందుకు ప్రతి ఏడు సెప్టెంబర్ 14న హిందీ దినోత్సవం జరుపుకుంటామని పేర్కొన్నారు.