TG: ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు చేపట్టిన బంద్కు మద్దతు తెలుపుతున్నామని BJP రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు అన్నారు. సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ప్రైవేటు కళాశాలలకు ఉందని చెప్పారు. విద్యావ్యవస్థను గత ప్రభుత్వం చెడగొట్టిందని ఆరోపించారు. ఈ ప్రభుత్వమైనా యాజమాన్యాలతో చర్చించి వారికి సహకారం అందించాలని కోరారు.