గుజరాత్ హైకోర్టుకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు హైకోర్టు పరిసర ప్రాంతాలను తనిఖీలు చేపట్టారు. ఎటువంటి బాంబులు లభ్యమవకపోవడంతో అంతా ఊపిరి పిల్చుకున్నారు. తనిఖీల అనంతరం నకిలీ ఫోన్ కాల్‌గా గుర్తించారు. ఈ ఫోన్ కాల్ ఎవరు చేశారు అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.