WNP: తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ పిలుపుమేరకు TUWJ 143 యూనియన్ జిల్లా వ్యాప్తంగా నిరసన చేపట్టింది. అధ్యక్షుడు బక్షి శ్రీధర్ రావు ఆధ్వర్యంలో రాజీవ్ చౌరస్తా నందు జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలతో నిరసన చేశారు. యూరియా కొరత పై రైతుల కష్టాలను గురించి వార్త రాసిన విషయంలో ఖమ్మం జిల్లా ప్రముఖ న్యూస్ బ్యూరో చీప్ సాంబశివరావు మీద ఉద్దేశపూర్వకంగా పెట్టిన కేసు ఎత్తివేయాలని కోరారు.