KRNL: ఆదోని పట్టణంలో మున్సిపల్ కమిషనర్ ఎం. కృష్ణ అన్న క్యాంటీన్లను తనిఖీ చేశారు. భోజనం నాణ్యత, పరిశుభ్రతను పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. పేదలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రజల నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు.