యూపీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. 15 రోజుల పసికందును తల్లిదండ్రులే సజీవంగా పాతిపెట్టిన ఘటన షాజహాన్పూర్లో వెలుగుచూసింది. బిడ్డ చేయి మాత్రం భూమిలోంచి బయటికి కంపించడంతో గ్రామస్థుడి ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని రక్షించారు. ప్రస్తుతం శిశువు ICUలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.