TG: భారీ వర్షం కారణంగా గోడ కూలి ఇద్దరు వ్యక్తలు మృతి చెందిన ఘటన గచ్చిబౌలిలో జరిగింది. ఈ ప్రమాదంలో మరో నలుగురు గాయపడినట్లు సమాచారం. మరోవైపు అఫ్జల్ సాగర్ నాలాలో ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. కాగా, భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.