టీమిండియా విజయం దిశగా దూసుకుపోతోంది. 11 ఓవర్లకు 93/2 స్కోరుతో నిలకడగా ఆడుతోంది. క్రీజులో ఉన్న తిలక్ వర్మ (29), సూర్యకుమార్ యాదవ్ (21) దూకుడుగా ఆడుతున్నారు. భారత్ విజయానికి ఇంకా 54 బంతుల్లో 35 పరుగులు అవసరం. దీంతో అభిమానుల్లో గెలుపుపై నమ్మకం పెరిగింది. నిలకడగా ఆడితే టీమిండియా విజయం సులువేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.