RR: రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన షాద్నగర్ సమీపంలోని చటాన్ పల్లి రైల్వే గేట్ వద్ద చోటుచేసుకుంది. ఫరూఖ్ నగర్ మండల పరిధిలోని వెలిజర్ల గ్రామానికి చెందిన లక్ష్మయ్య మెడికల్ షాప్ వద్ద మందులు తీసుకుని రైల్వే గేట్ దాటుతుండగా రైలును గమనించకపోవడంతో రైలు ఢీకొని మృతి చెందాడు. ఘటనాస్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.