ఆసియా కప్ టీ20 టోర్నమెంట్లో భారత్ దాయాది పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించింది. 128 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. పాకిస్థాన్ 127/9 స్కోరు చేయగా, భారత్ 131/3 స్కోరుతో 7 వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో భారత్ విజయోత్సవాలు జరుపుకుంటోంది.